శాంతి మండల సమైక్య సమావేశం మందిరంలో కిశోర బాలికలతో స్నేహ బాలిక సంఘాల ఏర్పాటుకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏవో డ్వాక్రా సుజాత పాల్గొన్నారు. యూనిస్ప్ వారి దిశానిర్దేశం లో గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ సౌజన్యంతో వరంగల్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా స్నేహ సంఘాల ఏర్పాటు చేసి కిశోర బాలికల యొక్క హక్కులు సాధించుకోవడానికి విద్యాపరంగా ఉన్నత అవకాశాలు అందుకోవడానికి, భద్రత విషయంలో ఆరోగ్యము పోషకాహార విషయంలో సమ వయస్కుల బృందంలో చర్చించుకునేలా ఏర్పాటు చేసిన వేదికనే స్నేహ కిశోర బాలికల సంఘంలు. ఈ సంఘాలలో 14 నుండి 18 సంవత్సరాల బాలికలను ఐదు నుండి 20 మందితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంఘం నెలకు రెండు నుండి మూడు సమావేశాలు నిర్వహించుకుంటారు ఈ సమావేశాల గూర్చి తల్లిదండ్రులతో గ్రామ పెద్దలతో చర్చించడం జరుగుతుందని సుజాత తెలిపారు. స్నేహకిశోర బాలికల సంఘం ముఖ్య ఉద్దేశం బాల కార్మికులు లేకుండా, లింగ వివక్షత లేకుండా సమానమైన అవకాశాలు అందుకునేలా శారీరక , లైంగిక హింసలకు గురికాకుండా, ఆరోగ్య రీత్యా రక్తహీనత మరియు పోషకాహార సమస్యలు లేకుండా ఆరోగ్యవంతంగా ఉన్నత స్థితికి చేరుకొని, అందివచ్చిన అవకాశాలు అందుకునేలా జాతీయాభివృద్ధిలో బాలికలు క్రియాశీలక పాత్ర పోషించేలా అన్ని రంగాలలో ఉన్నత అవకాశాలు అందుకునేలా విద్యాపరంగా ముందడుగు వేయటమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం కిషన్ ఎమ్మెస్ అధ్యక్షురాలు కర్నే కళ్యాణి కార్యదర్శి రాజమణి సీసీలు సురేశ్, కుమారస్వామి, ఏలియా, రాజయ్య, కృష్ణమూర్తి, ఎమ్మెస్ సిబ్బంది సుజాత,కృష్ణ ,కృష్ణవేణి మంజుల విఓఏలుతదితరులు పాల్గొన్నారు.