భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
08.10.2025 | కామేపల్లి మండలం, ఇల్లందు నియోజకవర్గం
ఇల్లందు నియోజకవర్గానికి చెందిన మాజీ శాసన సభ్యురాలు, అభివృద్ధి ప్రదాత, యంగ్ అండ్ డైనమిక్ నాయకురాలు శ్రీమతి బానోతు హరి ప్రియ హరి సింగ్ నాయక్ కామేపల్లి మండలంలో జరిగిన మండల స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ –
“రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం కోసం ప్రతీ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలి. కాంగ్రెస్ పార్టీ అమలుచేయలేని హామీలతో ప్రజలను మోసం చేసింది. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలకు బాకీగా ఉన్న గ్యారెంటీలను గ్యారెంటీ కార్డుల రూపంలో ప్రతి ఓటరుకు చేరవేయాలి” అని సూచించారు.
సమావేశంలో కామేపల్లి మండలానికి చెందిన ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు
కామేపల్లిలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
RELATED ARTICLES



