TEJA NEWS TV
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (TGSACS), కామారెడ్డి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం, కామారెడ్డి ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం రోజున బిక్నూర్ తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ ప్రాంగణంలో హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం, ర్యాలి లతో పాటు 5K పందెం పోటీలు నిర్వహించారు, 5k పరుగు పందెం పోటీలలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థుల విభాగంలో సౌత్ క్యాంపస్ కు చెందిన హరి కార్తీక్ ప్రథమ, నవీన్ ద్వితీయ, ఎస్ ఆర్ కే కళాశాలకు చెందిన సంగమేశ్వర్ తృతీయ, విద్యార్థినుల విభాగంలో కామారెడ్డి డిగ్రీ కాలేజీకి చెందిన జే. సౌమ్య ప్రథమ, ఎం అంజలి ద్వితీయ, సౌత్ క్యాంపస్ కు చెందిన కె సాత్విక తృతీయ స్థానాల్లో నిలిచారు. వారికి ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి డా. అంజయ్య, డా. హరిత లు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. సబిత, డా. యాదాద్రి, డా. రమాదేవి, డా. నర్సయ్య, దిలీప్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అకౌంటెంట్ ఏ.మహేష్, వై ఆర్ జి కే డిఆర్పి గర్దాసు సుధాకర్, లింకు వర్కర్లు శివరాం, బాల్ కిషన్, వర్డు కమ్యూనిటీ కో ఆర్డినేటర్ ప్రవీణ, శ్రీ విద్య తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా :హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం
RELATED ARTICLES