TEJA NEWS TV
దోమకొండ. వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో దోమకొండలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. దోమకొండ సీ హెచ్ సీ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు తీవ్రమైతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. అనంతరం వై ఆర్ జి కేర్ లింకు వర్కర్ స్కీం డీ ఆర్ పీ సుధాకర్ మాట్లాడుతూ… హెచ్ఐవి, టీబీ, సుఖ వ్యాధులపై అవగాహన కల్పించారు. అవగాహన, జాగ్రత్తలతోనే హెచ్ఐవి, టిబి రహిత సమాజం ఏర్పడుతుందన్నారు. ఈ శిబిరంలో 60 మందికి రక్త పరీక్షలు చేశారు. పలువురికి స్థానిక పల్లె దావఖానాలో మందులను అందించారు. కార్యక్రమంలో పీ హెచ్ సీ వైద్యురాలు భానుప్రియ, పల్లె దావఖాన ఎం ఎల్ హెచ్ పి జ్యోతి, లింకు వర్కర్ స్కీమ్ సూపర్వైజర్ జ్యోతి, లింకు వర్కర్లు బాలకిషన్, శివరాం, స్థానిక వాలంటీర్లు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా: వైఆర్ జీకేర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
RELATED ARTICLES