కామారెడ్డి జిల్లా లో విషాదం చోటు చేసుకొంది. మద్నూర్ మండలం ఎక్లారా గురుకుల పాఠశాలలో ఈ రోజు ఉదయం ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి గురైంది.విద్యార్థిని మృతి తో కోపోద్రిక్తులైన బంధువులు గ్రామస్తులు గురుకుల పాఠశాలలో ఆందోళన చేస్తూ పాటశాల కిటికీ అద్దాలను ఫర్నిచర్ ను ద్వంసం చేశారు.తమ కూతురిది ఆత్మ హత్య కాదని హత్య చేసి చంపారని మృతురాలి తల్లి దండ్రులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. రంగం లోకి దిగిన పోలీసులు మృతురాలి బంధువులను, గ్రామస్తులను సముదాయిస్తున్నారు.
: కామారెడ్డి జిల్లా లో విషాద ఘటన ఒకటి జరిగింది.కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనుర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి గురైన ఘటన ఒకటి జరిగింది.బిచ్కుంద మండలం మాన్యపూర్ కు చెందిన దాసరి వసుధ (16) మద్నూర్ మండలం లోని మేనూర్ గురుకులం లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది.దసరా సెలవుల అనంతరం నిన్న సాయంత్రం పాఠశాలకు తిరిగి వచ్చిన మరుసటి రోజు బలవన్మరణానికి గురవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.గత సంవత్సరం ఇదే తరహాలో పాఠశాలలో ఇంటర్ చదివిన మరో విద్యార్థిని శిరీష నీటి ట్యాంక్ లో దూకి బలవన్మరానికి గురైన విషయం తెలిసింది.తమ కూతురిని హత్య చేసి చంపారంటు కోపోద్రిక్తులైన బంధువులు గ్రామస్తులు పాటశాల పై దాడికి దిగి కిటికీ అద్దాలను ఫర్నిచర్ ను ద్వంసం చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు మృతురాలి బంధువులను గ్రామాస్తులను సముదాయిస్తున్నారు.