భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
27-07-2025
ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన నిశ్చయతాంబూలాల వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుక చండ్రుగొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి బయ్యారపు అశోక్ కుమార్తె నిశ్చయతాంబూలాల సందర్భంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో చండ్రుగొండ మండలానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారి మహంకాళి సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి కొడగండ్ల వెంకటరెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ప్రెస్ క్లబ్ సభ్యులు గాదె వెంకట్ రెడ్డి, శెట్టిపల్లి శ్రీనివాసరావు, రామిశెట్టి సైదయ్య, పి. రవి, షేక్ జాఫర్, నూరే రబ్బాని తదితరులు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికీ అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కాబోయే వధూవరులను ఆశీర్వదించిన మండల ప్రముఖులు – ఘనంగా నిశ్చయ తాంబూలాలు
RELATED ARTICLES



