నంద్యాల జిల్లా కానాల గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామ వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, జయంతి సంబరాలను జరుపుకున్నారు. వైఎస్ ఆత్మీయ సేవలు, ప్రజల పట్ల చూపిన చిత్తశుద్ధిని గుర్తు చేసుకుంటూ నాయకులు భావోద్వేగానికి గురయ్యారు.
కార్యక్రమంలో గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు జగదీశ్వర రెడ్డి, రంగారావు, దూదేకుల కాసిం, ఫరూక్, ఉదయ్ కుమార్, మధుబాబు గౌడ్, వుసేని, హసెన్, పకిర్ సా, ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





