మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట్ లోని అది శంకరాచార్య కాటన్ మిల్లులో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగిందని మిల్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పత్తి నిలువలకు అంటుకున్న మంటలకు పత్తి భారీ ఎత్తున నష్టం సంభవించినట్టు చెబుతున్నారు. సుమారు నాలుగు నుండి ఐదు గంటల వరకు పైర్ సిబ్బంది పంటలను అదుపులోకి తేవడానికి కృషి చేశారు. అప్పటికే మిల్లులో ఉన్న పత్తి పూర్తిగా కాలిపోవాగా పత్తి మిల్లు యజమాని కి భారీ ఎత్తున నష్టం వచ్చింది వాపోయారు.