భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం:
24-1-2025
దేశంలోని మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి కొండంత అండగా వున్నారని *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు.
కొత్తగూడెంలో *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం కార్యాలయాన్ని* శుక్రవారం పారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం *జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య* జిల్లా కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో పొదెం తోపాటు *కొత్వాల* పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా *కొత్వాల* మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృధే ధ్యేయంగా పాలనా సాగిస్తున్నదని అన్నారు. ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలు చేస్తున్నదని *కొత్వాల* తెలిపారు.
*పొదెం వీరయ్యను సన్మానించిన కొత్వాల*
ఈ సందర్భంగా *కొత్వాల* తోపాటు పాల్వంచ కాంగ్రెస్ నాయకులు *జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య* ను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమాల్లో *మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహమూద్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్, తోట దేవీప్రసన్న, నాగా సీతారాములు, నయీమ్ ఖురేషి, యర్రంశెట్టి ముత్తయ్య, కోండం వెంకన్న, మోతుకూరి ధర్మారావు, SK చాంద్ పాషా, పైడిపల్లి మహేష్, కందుకూరి రాము, ఉండేటి శాంతివర్ధన్, గౌస్ పాషా, కరీం పాషా*, తదితరులు పాల్గొన్నారు.
