TEJA NEWS TV:
ఈ రోజు AISF ఆధ్వర్యంలో హోళగుంద మండలంలోని తహసిల్దార్ హుస్సేన్ సాబ్ RI దినోజ్ కుమార్ వినతి పత్రం అందించారు. కస్తూర్బా గాంధీ విద్యాలయం నందు సీట్లను పెంచాలి. AISF జిల్లా సమితి సభ్యుడు శ్రీరంగ. మండల కార్యదర్శి సతీష్ కుమార్ వారు మాట్లాడుతూ విద్యాలయంలో సీటు ను పెంచి బాలికల విద్య అభివృద్ధికి పాటుపడాలని కోరారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో వదిలి వలసకు వెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న విద్యార్థులందరూ సీట్లు ఇవ్వాలని వారు కోరారు. కేజీబివి లో సీట్లను పెంచాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో AISF జిల్లా సమితి సభ్యుడు శ్రీరంగ AISF మండల కార్యదర్శి సతీష్ కుమార్ బాలిక బాధితుడు మల్లి తదితరులు పాల్గొన్నారు.
కస్తూర్బాయ్ గాంధీ బాలికల విద్యాలయంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి సీటు కల్పించాలి AISF–డిమాండ్
RELATED ARTICLES