కస్తాల అపర్ణ తల్లిదండ్రుల మనోవేదన తీర్చలేనిది
వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
ప్రభుత్వం తరఫున ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా
— ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కస్తాల అపర్ణ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని వారి తల్లిదండ్రుల మనోవేదన తీర్చలేనిదని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. మంగళవారం నాడు నందిగామ మార్చురి వద్ద అపర్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, అకాల మరణం చెందిన అపర్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుమార్తె మరణం పట్ల తీవ్ర మనోవేదన చెందుతున్న వారి తల్లిదండ్రులను స్వయంగా కలిసి మనోధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సదరు విషయాన్ని మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, సోషల్ వెల్ఫేర్ మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. వారి కుటుంబంలో ఉన్న పిల్లలకు అంబేద్కర్ గురుకులంలో చదివించే బాధ్యత తీసుకుంటామని, గ్రామ వార్డు సచివాలయాలలో కుటుంబ సభ్యులు ఒకరికి ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక నేతలతో కలిసి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అపర్ణ కుటుంబ సభ్యులకు అందజేశారు.
కస్తాల అపర్ణ తల్లిదండ్రుల మనోవేదన తీర్చలేనిది -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
RELATED ARTICLES