TEJA NEWS TV
-కుందుర్పి మండలాన్ని కలెక్టర్ ఆదర్శంగా తీసుకోవాలని సూచన.
-ఎక్సైజ్ పోలీస్, సివిల్ పోలీస్, ఆర్టీసీ, విద్యుత్, పట్టు పరిశ్రమ అధికారులు తరచు డుమ్మా.
-సమావేశానికి అనర్హ సభ్యులు హాజరు…
కళ్యాణదుర్గం,కుందుర్పితేజ టీవీ న్యూస్
ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రజా సమస్యల పరిష్కారానికి సమావేశాలను నిర్వహించి, సమస్యలు చర్చించి పరిష్కరించడానికి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని పలు శాఖల అధికారులు సమావేశాలకు మూడు నెలలకు ఒక్కసారి హజరుకావాలి, కానీ హాజరు కారు. అలాంటి తరుణంలో ప్రజా సమస్యలను అధికారులు ఏమి పరిష్కారం చేస్తారని, ఇది మీకు తగునా ఇంత నిర్లక్ష్యం తగదని సభ్యులు ఆగ్రహించారు. గురువారం స్థానిక కుందుర్పి మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఏ,ఓ,శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక మండలాధ్యక్షురాలు కమల నాగరాజు అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ. స్థానిక ఎంపీడీవో లక్ష్మి నరసింహ కృషితో గత మూడు నెలల వ్యవధిలోని జిల్లాలో మారుమూల ప్రాంతమైన కుందుర్పిని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలులో ముందు పీఠానా నిలిచేలా జిల్లాలోని ఆదర్శంగా తీసుకొచ్చారని, ఆ మండలాన్ని ఆదర్శ మండలంగా తీసుకోవాలని కలెక్టర్ యం,గౌతమి సూచించిందని గుర్తు చేశారు. ఎవరైనా వ్యక్తులు పాముకాటుకు గురైతే ఆ వ్యక్తికి ఆకుపసరు తాపవద్దని వైద్యాధికారి అనూష సూచించారు. తద్వారా పాము కాటు వేస్తే వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురావాలని, మందులు అందుబాటులో వున్నాయని తెలిపారు. పాము కాటుకు మూడు గంటల్లోగా చికిత్స అందివ్వాలని, మూడు గంటలు దాటితే వ్యక్తి మృతి తప్పదన్నారు. బండమీద మునెమ్మ పాము కాటుతో చికిత్సకు ఆలస్యంగా హాజరయ్యారు అన్నారు. విద్య శాఖ ఏఐ మూడేళ్ల నుండి సమావేశానికి హాజరు కావడం లేదని ఇలా అయితే ఎలా, అని, జంబు గుంపుల గ్రామపంచాయతీకి డామెజు పోల్స్ స్థానంలో ఒక విద్యుత్ పోలి ఇవ్వలేదని గ్రామ సర్పంచ్ గంగాధర ,ఎంపిటిసి, నరసింహారెడ్డిలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ భవనాలు ,సచివాలయం, ఆర్బికే కేంద్రాలు ,హెల్త్ క్లినిక్లు పనుల నిర్మాణం నత్తనడకన కొనసాగుతుందని, పనుల నిర్మాణం వేగవంతం చేయాలని జడ్పిటిసి రాధాస్వామి పిఆర్ ఇంజనీర్ వరప్రసాద్ కు సూచించారు. ఉపాధి కూలీల బిల్లులు గత రెండు నెలలుగా అందవలసి ఉందని, రూ,70 లక్షల మెటీరియల్ ఉందని, నివాసం ఉన్న గ్రామాలలో ఉపాధి కూలీలకు ఉపాధి కల్పిస్తామని ఏపీఓ ,ఓబిరెడ్డి తెలిపారు . ఈ సమావేశానికి కేవలం సభ్యులు మాత్రమే హాజరు కావాలని నిబంధనలో వున్న ఆచరణలో విస్మరించి, అనర్హులు సమావేశానికి హాజరు కావడం ఆశాస్పదంగా ఉంది. ఈ సమావేశానికి ఒక్కసారి సైతం సివిల్ పోలీసులు, కంబదూర్ ఎక్సైజ్ పోలీసులు, కళ్యాణ్ దుర్గం ఆర్టీసీ అధికారులు, విద్యుత్ శాఖ ఏఈ, తరచూ డుమ్ము కొడుతున్నారని సభ్యులు ధ్వజమెత్తారు. వేసవికాలం దృష్ట్యా ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ దీపిక తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత స్థాయిలో అధునాత్మక పద్ధతులతో డ్రోన్ లను ప్రవేశపెట్టారన్నారు. డ్రోన్ పనితీరుతో పొలాల్లో డిమానిస్ట్రేషన్ చేసేలా చూపించడం జరిగిందన్నారు. మండలంలో మూడు డ్రోన్లు మంజూరయ్యాయియని ఏవో మహేష్ పేర్కొన్నారు. ఈ డ్రోన్లో ఒకటి రూ,10 లక్షలు విలువ పడుతుందని, లబ్ధిదారు రూ,ఒక లక్ష చెల్లిస్తే ,నాలుగు లక్షల బ్యాంక్ సబ్సిడీ చెల్లిస్తుంది అన్నారు. లబ్ధిదారులకు మండలంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం అధికమవుతున్నాయి అన్నారు. తద్వారా కేజీబీవీ, మహాత్మ జ్యోతిరావు పూలే విద్యాలయంలో సీట్లు పెంచాలని ఎంఈఓ తిప్పేస్వామి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, కోఆప్షన్ ,సభ్యుడు, గ్రామ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
