
TEJA NEWS TV:
-త్వరిత గతిన సమస్యల పరిష్కరించాలి.
-కెనరా బ్యాంక్ ఎదుట మానవహారం, ర్యాలీ.
-వినూత్న రీతిలో అంగన్వాడీల నిరసన.
-సీఎం చిత్రపటానికి చరవాణి లను పెట్టి మానవారం తొ మంత్రోచ్ఛారణ వినతి.
కళ్యాణ్ దుర్గం,కుందుర్పి, తేజ,న్యూస్:
అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 24 రోజులగా నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం తగదని సిపిఐ మాజీ మండలాధ్యక్షురాలు గిరిజ, సిపిఐ మహిళ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. గురువారం తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసన సమ్మె 24 రోజుకు చేరింది. ఈ క్రమంలోనే అంగన్వాడీల సమ్మెకు వీరి న్యాయమైన సమస్య అని సిపిఐ నాయకులు మద్దతు పలికారు. గ్రామ పురవీధుల గుండా తొలత ర్యాలీ నిర్వహించారు.స్థానిక కెనరా బ్యాంక్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు, సిపిఐ మహిళా నాయకులు మహిళా సమస్య నాయకులు మానవహారంగా ఏర్పడ్డారు. వెంటనే అంగన్వాడీల సమస్యలను త్రుతగతిన సమస్యలు పరిష్కరించాలి, అంగన్వాడీ ల ఐక్యత వర్ధిల్లాలి, సిఐటియు వర్ధిల్లాలి అంటూ పెద్ద పెట్టన నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వాయించడం తగదన్నారు. తద్వారా ఒక కిలోమీటర్ మేర ట్రంపిక్ సమస్య జటలం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వాహనాల ఇబ్బందుల గుర్తించి మానవహారం కార్యక్రమాన్ని అంగన్వాడీలో విరమించారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో సమస్యల పట్ల పరిష్కరించాలని జగనన్నకు మంత్రోచ్ఛారణ చేశారు. సీఎం జగనన్న చిత్రపటానికి చుట్టూ అంగన్వాడీల చరవాణి లను మానవహారంగా పెట్టి తమ ఎదుర్కొంటున్న సమస్యలను ఏక కరువు పెట్టేలా వినతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.