TEJA NEWS TV :
పంచభూతాలకు అధిపతి వీరభద్రుడు…..
-దజ్జుని సంహారం చేసిన వీరుడే వీరభద్రుడు.
-అసలే రౌద్రుడు, ఉగ్రుడు వీరభద్రుడు.
-స్థానికంగా వెలసిన పురాతన బసవన్న ఆలయం.
-అద్భుతంగా వెలిసిన వీరభద్ర, నందిని, శివలింగాలు.
-శిథిలా వ్యవస్థలో ఆలయం.
-నాడు పూజలు, దీప, ధూపాలు కరువు.
-ఘన చరిత్రకు ప్రతిరూపం కుందుర్పి.
-దేవాలయాలకు పుట్టినిల్లు కుందుర్పి.
కళ్యాణదుర్గం,కుందుర్పి, ( తేజ న్యూస్):
సమాజంలో ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉచితంగా లభ్యమయ్యేవి నాడు గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు ఇవి ఐదు పంచభూతాలకు పరిరక్ష అధిపతిగా వీరభద్రుడు నిలిచాడు అనడంలో సందేహం లేదు. పరమశివుడు జడ జుటిన వెలసిన వాడే వీరభద్రేశ్వరుడు. కాగా రౌద్రుడు ఉగ్రరూపం దాల్చిన దేవుడుగా ఆయన ఎక్కడైనా గ్రామాలకు దూరంగా వీరభద్రుడు వెలుస్తాడు. దక్షున్నే సంహారం చేసిన వీరుడే ధీరుఢే వీరభద్రుడు.శివ భక్త గణాలకు అధిపతి వీరభద్రుడు.ఆయన అసలే రౌద్రుడు, ఉగ్రుడు రూపం అయినది. వీరభద్రుని దృష్టి గ్రామం పైన పడకూడదు. మండల కేంద్రమైన కుందిర్పిలో ప్రధాన రహదారి ప్రక్కన ఆ స్వామి ఉత్తర దిశగా ముఖద్వారంగా ప్రతి పురాతన ఆలయం రెండు ప్రాకారాలలో బసవన్న ఆలయం వెలిసింది. ఆలయంలో స్వామివారు ఉగ్రుడు కాబట్టి ముఖ ద్వారానికి ఎదుట నంది విగ్రహాన్ని, ముఖద్వారానికి ప్రక్కన వీరభద్రుడు విగ్రహాలను ఆనాటి పాలకులు గ్రామానికి పాలకచేత్రాకుడిగా విగ్రహ ప్రతిష్టించారు అప్పట్లో. ఈ స్వామివారు నిలవెత్తు విగ్రహ రూపంలో వీరభద్రుడు వెలసి ఎడమ ప్రక్కన దక్షుడు కొలువుదీరేలా భక్తులకు దర్శనం ఇస్తారు. అయితే వీరభద్రుడికి రెండు ప్రక్కల మూడు చేతులతో అవతరించి ఒక కూడిచేతిలో కత్తి, త్రిశూలం, బర్జి, చేత భూని, మరో ఎడమ చేతిలో ధనస్సు, బాణం, డమరుకం, శివుడి ఆయుధాలను చేతపట్టినట్టు దర్శనం రూపంలో భక్తులకు భరోసా ఇచ్చేలా కనిపిస్తాడు. నాడు పూర్వకాలంలో రాతి, రాతి గారితో ఆలయాన్ని నిర్మించారు. నేడు గారు పైపచ్చులు ఊడిపడి శీతలాస్థితికి చేరుకుంది. గతంలో కొందరు స్వార్ధపరులు ఈ ఆలయంలో ఏకశిలా నంది విగ్రహం కింద గుప్త నిధులు దాగి వున్నాయని భావనతో తవ్వకాలు ప్రయత్నాలు జరిపినారు. అయిన ప్రయత్నాలు ప్రజల భగ్నం చేయగా ఫలించలేదు.ఆ గ్రామస్తులు ఆర్థిక వితరణతో ఆ ఆలయంకు వెలుగుకు నోచుకోనెల విద్యుత్ సౌకర్యం, ప్రహరి ఇనుప తలుపులు నిర్మాణం చేయించారు. ఒక ఆలయంలో కళాత్మకంగా ఉట్టిపడేలా నంది విగ్రహం పండుకున్నట్టు కళాకారులు సుందరంగా చెక్కడ విశేషం. నంది పక్కనే వీరభద్ర విగ్రహం వెలిసిన విషయం విదితమే. మరో ప్రక్కన ఆలయంలో శివలింగం వెలిసింది. ఈ శివలింగానికి ఎదురుగా మరో నందిని విగ్రహం వెలసింది. ఈ శివలింగానికి మూడో బ్రహ్మ గీతిలో ఉన్నాయంటే ఆలయాన్ని దర్శించిన భక్తులకు మంచి శుభాలు కలిగి ఆలయం ఆదరణ పొందుతుందని విశ్వాసం ప్రజల్లో ఉంది. ప్రసన్న వదనంతో కిరీటం మకుటాన్ని కలిగి స్వామి ఆర చేతిలో వివిధ ఆదాయుధాలతో దర్శనం కొలువుదీరాడు. ఆయనను దర్శించిన మాత్రాన భక్తులు ఎంతటి క్లిష్ట సమస్యలైన అయిన తొలగిపోతాయని, వ్యాధులు నశించి, ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి. ముఖ్యంగా అగమన సంప్రదాయంలో చేత్ర పాలకుడు పూజకు చాలా విశేష స్థానం కలదు. చైత్ర పాలకుడు పూజలు చేయడం పట్ల ఆ చేత్రంలో ఉన్న భక్తులు ఎటువంటి భయ,బాదులు లేకుండా, సుఖ సంతోషాలతో ఉంటారు. మంగళవారం, అమావాస్య రోజులలో చేసే వీరభద్ర పూజ అనేక ఫలితాలు ఇస్తుందని అగమన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామి పూజతో సకల గ్రహ, అరిష్ట దోషాలు, దుష్ట గ్రహ పీడలు, తొలగిపోతాయి. అదేవిధంగా పిల్లల సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేకం శుభ ఫలితాలు చేకూరుతాయని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం వుంది. స్వామివారికి పంచామృతం ,బిల్లోదకం, కలంక మోదకం, హరిద్రోహం చస్మాదకం, గందోటకం, పుష్ప దకం, శుద్ధ జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం చాలా మంచి జరుగును. ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలు అందరూ కృషి చేయాలని కోరుతున్నారు భక్తులు. ఇకనైనా ఘన చరిత్ర కలిగిన ఈ దేవాలయం భవిష్యత్తులో ఈ చేత్రం దినదిన అభివృద్ధి చెందాలని ఆ గ్రామ ప్రజలు, భక్తాదులు కోరుతున్నారు.