Friday, January 24, 2025

కళ్యాణదుర్గం : విశిష్ట అవార్డు గ్రహీత, ఉపాధ్యాయుడు బద్దే నాయక్ చైర్మన్ గా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం

TEJA NEWS TV :




పేదరిక నిర్మూలనే ద్యేయంగా ప్రారంభమైన ఇన్ఫినిటీ అనగా (అనంతం )చారిటబుల్ ట్రస్ట్..*


విద్యా, వైద్యం ప్రధాన అజెండా గా సేవా కార్యక్రమాలు కొనసాగింపు.* .


రూ.500లే నా జీవితానికి మలుపు.*

..విశిష్ట అవార్డు గ్రహీత ఉపాధ్యాయుడు బద్దె నాయక్*



అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లో విశిష్ట సేవ అవార్డు గ్రహీత ఉపాధ్యాయుడు బద్దె నాయక్ చైర్మన్ గా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ ఇండస్ మార్టిన్, లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ, కరణం రాము, పోతుల రాధాకృష్ణ, కంబాల తిమ్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సేవ చేయడం ఓ గొప్ప వరమని అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతోమందికి సేవ చేస్తున్నారన్నారు. డబ్బు అందరికీ ఉంటుంది కానీ సేవ్ చేయాలన్న ఆలోచన కొందరికి మాత్రమే ఉంటుందని అన్నారు. మధ్యన పెంచుకున్న విధానం మాకు చాలా నచ్చిందని అన్నారు.



సమ సమాజ నిర్మాణంలో ఇలాంటివారు మరింత మంది ముందుకొచ్చి పేదరిక నిర్మూలన కోసం శ్రమించాలన్నారు.


విశిష్ట అవార్డు గ్రహీత ఉపాధ్యాయుడు బద్దే నాయక్*

పేదరిక నిర్మూలన కోసం చాలా చేతులు కావాలని కానీ నాకున్నది రెండే చేతులని విన్సెంట్ ఫెర్రర్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ… మదర్ తెరిసా స్ఫూర్తితో ఫాదర్ ఫెర్రర్ అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నానన్నారు. నా జీవితంలో రూ.500 లే జీవితాన్ని మార్చిందన్నారు.



2006 సంవత్సరంలో నేను డిగ్రీ చదివే సమయంలో చదవడానికి డబ్బులు లేక పేదరికంతో ఇబ్బంది పడుతున్నానన్నారు. రోజు కష్టపడితే కానీ పూట గడవడమే కష్టంగా ఉన్న రోజుల్లో మా నాన్న పండుగ సమయంలో సరుకులు తీసుకెళ్లేందుకు కళ్యాణ్ దుర్గం పట్టణంలోకి వచ్చారని అయితే అక్కడ రూ.500 రూపాయలను పోగొట్టుకొని ఇంటికి వచ్చి చాలా బాధపడే వారిని అలాంటి సమయంలో తాను ఓదార్పుగా మా నాన్నను ఓదార్చమన్నారు




అప్పటినుండి పేదరికంతో ఏ ఒక్కరూ బాధపడకూడదు అన్న సంకల్పంతో నేను మొదటిగా డీఎస్సీ రాసినప్పుడు ఉద్యోగం సంపాదించలేకపోయాను అప్పుడు మా అన్న ఎంతో ధైర్యం చెప్పి కాంట్రాక్టు లెక్చరర్ గా కడప జిల్లాలో పనిచేసి కొంతవరకు అప్పు తీర్చా అన్నారు. 2012 డీఎస్సీ పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించా అన్నారు. నా మొదటి ఉద్యోగం సెట్టూరు మండలం కైరేవు గ్రామంలో విధులు నిర్వహిస్తూ… రూ. 5000 తో మొదటగా సాయం చేయడం ప్రారంభించి నేడు ఒక నెలకు 30 మంది వరకు సాయమందిస్తున్నానన్నారు. ఇక నా రెండు చేతుల్లో సాయం చేయడం కష్టంగా ప్రతి చేయి కలిపితేనే అందరికీ సాయం చేయగలమని ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చానన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular