-విద్యార్థి దశ నుండే సేవా దృక్పతాన్ని అలవర్చుకోవాలి.
-ముగిసిన ఎన్,ఎస్,ఎస్, ప్రత్యేక శిబిరం.
-ఎన్ఎస్ఎస్ బృందానికి గ్రామస్తులు అభినందనలు,
కృతజ్ఞతలు తెలిపారు.
కళ్యాణదుర్గం,కుందుర్పి,( తేజ టీవీ న్యూస్);
పాఠశాలలో విద్యాసం చేసే విద్యార్థులు విద్యార్థి దశ నుంచే సేవా దృక్పథంతో సామాజిక సేవా కార్యక్రమాలును చేపట్టేలా నాంది పలికి అలవారుచుకోవాలని స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ,టి,అరుణ, ఎన్.ఎస్.పి.ఓ ,నరేష్ నాయుడు, విద్యార్థులకు పిలుపునిచ్చారు.
బుధవారం మండల పరిధిలోని జంబుగుంపుల గ్రామంలో ఎడవ రోజు స్థానిక ఋషి సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం యూనిట్ వన్, యూనిట్ టు, ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యాపరమైన సమావేశం పట్ల అవగాహన సదస్సు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యువతీ ,యువకులే అవగాహన కల్పించారు. ఇప్పటిలో ప్రతి వ్యక్తికి స్వార్థం నానాటికి పెరిగిపోయింది అని, సమాజసేవ కార్యక్రమం చేపట్టేవారు తగ్గుముఖం పట్టారని చెప్పారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు స్వచ్ఛందంగా నిస్వార్ధంగా జంబుగుంపుల గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు. తొలత జమ గుంపుల గ్రామంలో చర్చి పరిసర ప్రాంతాలలో నెలకొన్న అపరిశుభ్రతను విద్యార్థులు తొలగించి శుభ్రపరిచారు. అదేవిధంగా ఆధునిక యుగంలో శాస్త్రీయ దృక్పథం పెరిగిన నేటికీ మూఢనమ్మకాలు కొనసాగిస్తున్నారని, వాటిని విడాలన్నారు. చిన్నపిల్లలకే బాల్య వివాహం చేయడం చట్టరితే నేరమని, వాళ్ళవి వాళ్ళు చేయడం వల్ల ఏర్పడే నష్టాలను వివరించారు. ప్రొజెక్టర్ ద్వారా నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, మూఢనమ్మకాల పైన అవగాహన కల్పించారు. బాలవివాహాలు అడ్డుకట్ట వేయాలంటే విద్యార్థులు, తల్లిదండ్రుల అవగాహనతోనే సాధ్యమన్నారు. పర్యావరణం పరిరక్షణ పైన విద్యార్థులకు అవగాహన కల్పించి చైతన్యపరిచారు. ఈ కార్యక్రమం ఈనెల ఒకటి నుండి ఏడు వరకు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో చేపట్టే గ్రామన్ని పరిశుభ్రంగా విద్యార్థిని విద్యార్థులు తీర్చిదిద్దినందుకు ఆ సంస్థకు అభినందించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాలంటీర్లు,విద్యార్థిని విద్యార్థులు , కళాశాల సిబ్బంది అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్, ఫీవోలు ఒకటి, రెండు అధికారులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం: విద్యార్థి దశ నుండే సేవా దృక్పతాన్ని అలవర్చుకోవాలి -ముగిసిన ఎన్,ఎస్,ఎస్, ప్రత్యేక శిబిరం
RELATED ARTICLES