
నాలుగున్నరేళ్లు పూర్తవుతున్నా ఒక్క రోడ్డు వేయలేని జగన్ ప్రభుత్వం
మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి..!*
మహిళల భద్రత కోసమే మిని మేనిఫెస్టో *
ఉన్నం వరలక్ష్మి
*కళ్యాణదుర్గం తేజ టీవీ న్యూస్
మండల పరిధిలోని మల్లికార్జునపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ*పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి కోడలు ఉన్నం వరలక్ష్మి, టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం ఉన్నం వరలక్ష్మి గారు ప్రతి ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో రోడ్లు వేయడం జరిగిందని నేడు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తయినా ఒక్క గ్రామానికి కూడా రోడ్డు వేయలేకపోవడం సిగ్గు చేటని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి* విమర్శించారు. మహిళల భద్రత, మాహిళల అభ్యున్నతి కోసమే మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి పేరుతో మిని మానిఫెస్టోను పెట్టారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి మహిళలకు భద్రత చేకూరుస్తామని అందుకోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేయ్యాలని ఉన్నం వరలక్ష్మి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాపంపల్లి రామాంజనేయులు, కళ్యాణదుర్గం మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల వెంకటేషులు, జనార్ధన, చంద్ర, భార్గవ, చిత్తయ్య, సోమశేఖర్, చిత్తయ్య, వెంకటేషులు, గోపాల్, నరసింహులు, విట్లంపల్లి గ్రామ కన్వీనర్ వై బాబు, మృత్యుంజయ, సిద్దప్ప, మమతమ్మ, శివమ్మ, లక్ష్మి, అమృత, రాజేష్, భీమలింగ, కొండయ్య చౌదరి, జయప్ప, దొనప్ప, ప్రతాప్, హరి, బొజ్జప్ప, గూబనపల్లి గోవింద, జయరాములు, నారాయణ, మాజీ జెడ్పిటిసి కొల్లాపూరప్ప, శామీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బుజ్జి, మాజీ కౌన్సిలర్ నాగరాజు, జీపీ నారాయణ, మల్లిపల్లి నారయణ, అక్కమ్మ గార్ల మాజీ ఆలయ కమిటీ చైర్మన్ గొర్ల గోవిందరాజులు, గడ్డం రామాంజనేయులు, పాలబండ్ల రామన్న, బండి గోపాల్, బోర్ల గోపాల్, లక్ష్మీనారాయణ, మహిళలు వందలాది మంది పాల్గొన్నారు..