కళ్యాణదుర్గం తేజ టీవీ న్యూస్
పట్టణ శివార్లలో ఉన్న బాలా బాబు వనక్షేత్రం నందు ఆదివారం పాత్రికేయుల ఆత్మీయుల సమావేశాన్ని నిర్వహించారు..ఈ సమావేశానికి రాయదుర్గం వైకాపా రెబల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు,రైతులకు బోగి,సంక్రాంతి ,కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు… బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ నివాసి తెలిపారు…తాను నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు…తాను ఎమ్మెల్యే కాకమునుపు ఉపాధ్యాయుడిగా ,జర్నలిస్ట్ గా పని చేశానని ఆయన అన్నారు..తాను సాయంకాలం, కన్నడ నాడు దినపత్రిక లలో , జనశ్రీ చానల్ వంటి వాటిలో పనిచేశానని ఆయన అన్నారు.. ఉపాధ్యాయ వృత్తి ,పాత్రికేయ వృత్తి అంటే తనకు అమితమైన గౌరవమని అన్నారు..ఎందుకంటే సమాజంలో ఎక్కువగా పాత్ర పోషించేవి ఉపాధ్యాయ వృత్తి,పాత్రికేయ వృత్తేనని అన్నారు…అనునిత్యం కళ్యాణదుర్గం నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని,సేవ చేసే అవకాశం కల్పించాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు…
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటా- ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
RELATED ARTICLES