Saturday, January 18, 2025

కళ్యాణదుర్గం :అక్రమంగా తరలి వెళ్తున్న కర్ణాటక మద్యం పట్టివేత





రెండు కేసులు నమోదు చసిన
ఎస్సై రాంభూపాల్



సెట్టూరు

మండల పరిధిలోని రెండు గ్రామాలను తమకు రాబడిన సమాచారం మేరకు ఎన్ని కేసులు నమోదు చేసినట్టు ఆదివారం  స్థానిక ఎస్ఐ రాంభూపాల్ తెలిపారు. అయన తెలిపిన మేరకు కేసు వివరాలు ఇలా.
తొలి కేసు మాకు రాబడిన సమాచారం మేరకు సెట్టూరు మండలం, తిప్పనపల్లి గ్రామానికి చెందిన బోయ, చిట్టమ్మ, వయసు 38 సంవత్సరాలు భర్త పేరు బోయ, రంగస్వామి అను ఆమె ఒక ప్లాస్టిక్ సంచిలో 12 పవర్ కూల్ స్ట్రాంగ్ బీర్లు  650 యం,యల్ అను కర్ణాటక మద్యo బాటిళ్ళ ను తీసుకొని పోతున్నారు. ఈ క్రమంలోనే  వారిని  అయ్యగార్లపల్లి  చెక్ పోస్ట్ వద్ద ఆమెను పట్టుకుని ఆమె నుండి పైన తెలుపబడిన కర్ణాటక మధ్యమును స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేయడమైనది.
రెండు కేసు మాకు రాబడిన సమాచారం మేరకు సెట్టూరు గ్రామం , మండలం,లోని డీ సెంట్ డాబా చెక్ పోస్ట్ సమీపం లో చెక్ పోస్ట్ సిబ్బందితో కలిసి వెహికల్ చెక్ చేస్తుండగా. ఒక వ్యక్తి ఒక బ్యాగ్ మోసుకుని వస్తుండగా పోలీసులను చూసి సదరు వ్యక్తి సదరు బ్యాగ్ ను వదిలి పెట్టి పోలీసులకు దొరక కుండా పారి పోయినాడు. సదరు బ్యాగ్ ను చెక్ చేయగా అందులో కర్ణాటక రాష్ట్రం కు చెందిన 220  హైవర్డ్స్ చీర్స్ విస్కీ 90 యం,యల్, టెట్రా పాకెట్స్, ఉన్నట్టు గుర్తించారు. సదరు పారి పోయిన వ్యక్తి గురించి రహస్యంగా సమాచారం విచరించుకోగా కళ్యాణదుర్గం మండలం, నారాయణపురం గ్రామం,వాసి అతని పేరు బోయ అశోక్  తండ్రి పాతురప్ప, అని తెలిసింది. పై తెల్పిన మద్యంను  ముందు చర్య నిమిత్తం నా స్వాధీనం లోకి తీసుకొని సదరు. వ్యక్తి పై కేసు నమోదు చేయడ మైనది అనే స్థానిక సెట్టూరు ఎస్ఐ ఎస్. రాంభూపాల్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular