TEJA NEWS TV : ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధమే విద్య..
-ఘనంగా అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం.
-బ్రహ్మాండంగా జరిగిన బాలిక దినోత్సవం.
కళ్యాణదుర్గం,కుందుర్పి తేజ టీవీ న్యూస్
ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య ఒక్కటే నని, తద్వారా ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించి విజ్ఞానవంతలై భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అవరోదించాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి అరుణ పేర్కొన్నారు. మండల కేంద్రమైన కుందేర్తిలో స్థానిక రుషి డిగ్రీ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ విద్య దినోత్సవం ఘనంగా, బాలిక దినోత్సవం వేరువేరుగా బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడారు. సమాజంలో విద్యార్థి నీడ లాంటిదని దానిని మన నుండి ఎవరు వేరు చేయలేమన్నారు. ఏదైనా వస్తువును ఎవరైనా దొంగతనం చేయవచ్చునేమో కానీ, విద్యను మాత్రం ఎవరు దొంగలించలేనిది అన్నారు. విద్య గురించి బాలికల గురించి విద్యార్థులకు నిశితంగా వివరించారు. సమాజంలో విద్య పట్ల ఒక అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరిచారు. నేటి సమాజంలో బాలికల పట్ల ఎలా ఉండాలి అనే అంశం పైన చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు జాతీయ సేవా పథకం సభ్యులు పి,వోలు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గంలో ఘనంగా అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం
RELATED ARTICLES