TEJA NEWS TV: కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలో మండల కేంద్రంలో జరిగిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేఖరి శివ కేశవుపై మంత్రి గుమ్మనూరు జయరాం తనయుడు ఈశ్వర్, తమ్ముళ్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ గుమ్మనూరు శ్రీనివాసులు సహా మంత్రి అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఏపీడబ్ల్యూజే సభ్యులు ఈరోజు కోసిగి తాసిల్దార్ కార్యాలయం ముందు ఏపీడబ్ల్యుజే జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్, కోసి మండల ప్రధాన కార్యదర్శి ప్రదీప్ ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. దేశంలో ఫోర్త్ పిల్లర్ గా పేరు ఉన్న మీడియాపైనే సాక్షాత్తు వైసిపి నాయకులు దాడులు చేస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చని,మంత్రి అనుచరులు చేస్తున్న ఆగడాలను చిత్రీకరించిన రిపోర్టర్ పై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు పాకెట్ లో ఉన్న 30000 నగదు లాక్కొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం తనయుడు అతని సోదరులపై తక్షణమే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఏపీడబ్ల్యుజే పిలుపు ఆదేశాల మేరకు ఏపీడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్ కోసిగి మండల ఏపీడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి ప్రదీప్ లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోసిగి మండల ఏపీడబ్ల్యూజే సభ్యులు సతీష్, ప్రవీణ్ ,యూసుఫ్, జీవన్ ,లక్ష్మన్న ,మధు తదితరులు పాల్గొన్నారు
కర్నూలు జిల్లా : విలేఖరి పై జరిగిన దాడిని వారిని కఠినంగా శిక్షించాలని విలేకర్ల డిమాండ్
RELATED ARTICLES