




నేడు పెద్దగోనెహాల్ మరియు MD హళ్లి గ్రామాల్లో గడప గడపకు-మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.
గ్రామాల్లో భారీ స్వాగతం పలికిన గ్రామ నాయకులు,ప్రజలు.
ప్రజా సమస్యల పరిష్కారానికై – గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం.
పెద్దగోనెహాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సచివాలయం ద్వారా సంక్షేమ పథకాలు మొత్తం దాదాపు 9కోట్ల 76 లక్షలు రూపాయలు లబ్ధి పొందారు.
20లక్షలు సచివాలయం నిధులుతో గ్రామంలో బీసీ కాలనీ,SC కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయండి
ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 36 లక్షలు రూపాయలు నిధులు ద్వారా జలజీవన్ మిషన్ ద్వారా గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాము.
*రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం
ప్రజా సమస్యలను పరిష్కరించడానికై గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంముఖ్య ఉద్దేశమని రాష్ట్ర కార్మిక , ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.ఈ సందర్భంగా నియోజక వర్గంలో హోలగుంద మండలం నందు పెద్దగోనెహాల్ మరియు MD హళ్లి గ్రామాల్లో లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఒక్క మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తోనే సాధ్యం అని చెప్పారు.గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి చెందుతుంది అని చెప్పారు.జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు శాశ్వత అభివృద్ధి వైపు కూడా అడుగులు వేయడం జరిగింది అని సంక్షేమం – అభివృద్ధి రెండు రెండు కళ్ళు లాంటివి అని చెప్పారు.పేద ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను సీఎం వైయస్ జగన్ గారు తీసుకురావడం జరిగింది అని చెప్పారు.అలాగే రైతు ల.సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఎరువులు,విత్తనాలను అందించడం జరుగుతుంది అని చెప్పారు.నిత్యం ప్రజా సంక్షేమం కోసం పరితపించే మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్య మంత్రిగా చేసుకుంటేనే మనకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ లభిస్తాయి అని అన్నారు.
*అనంతరం మంత్రివర్యులు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా పర్యటిస్తూ…రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాధరణ పొందుతున్నదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏఏ స్థాయిలో , ఏఏ వర్గాలకు, చెందుతున్నాయో, ఏమాత్రం చెందుతున్న అన్న అంశంపై మంత్రి ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో జగన్ పై నమ్మకం కుదిరించుకుంటూ అభివృద్ధి దృష్టిలో పయనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం అనేక రకాలైన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.
ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 36లక్షల రూపాయలు నిధులు ద్వారా జలజీవన్ మిషన్ ద్వారా గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించి శాశ్వత పరిష్కారం చేపడతామని హామీ ఇచ్చారు.
పెద్దగోనెహాల్ మరియు MD హళ్లి గ్రామాల్లో సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ. 09 కోట్ల 76 లక్షలు అర్హులైన వారకి లబ్ధి చేకూరిందన్నారు. గ్రామ సచివాలయం నిధులతో మౌలిక సదుపాయాల కొరకు డ్రైనేజీ, రోడ్లు, పనులు కొరకు ప్రణాళికలు సిద్ధంచేసిపనులు ప్రారంభించాలన్నారు.
*ఈ కార్యక్రమంలో మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి గారు,గుమ్మనూరు శ్రీనివాసులు గారు,గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ మల్లికార్జున,ఎంపీపీ తనయుడు ఈషా,మండల కన్వీనర్ షఫీ,జిల్లా కార్యదర్శి రాంభీంనాయుడు,నాయకులు మర్రిస్వామి,పాండురంగ,రాఘవ రెడ్డి,రంగస్వామి,చాకలి శంకర్,మల్లికార్జున రెడ్డి,తిక్కన్న,మరిన్ బాషా అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.