రైతులకు మరణం ఏ రూపంలో వస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. తమ సంపాదనంతా అంత పంటలు పండించడానికి వెచ్చించి చివరికి పొలంలోనే ప్రాణాలు కోల్పోతున్న విషాద ఘటనలు కోకొల్లలు. కరెంటు మోటార్ లోకి వర్షపు నీరు పోకుండా మోటారుకున్న తలుపు బంద్ చేయడానికి వెళ్లి యువ రైతు మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లా కోసిగిలో చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే కర్నూలు జిల్లా కోసిగి గ్రామానికి చెందిన దొడ్డి రామయ్య, తాయమ్మ దంపతుల పెద్ద కుమారుడు నాగరాజు అనే 19 సంవత్సరాలు వయసు గల యువకుడు విపరీతంగా కురుస్తున్న వర్షానికి పొలంలో గల విద్యుత్ మోటార్ లోకి నీరు వెళ్లి పాడవుతుందేమో అని విద్యుత్ మోటార్ కు గల తలుపును మూసివేసే క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. అది గమనించిన స్థానికులు పుటా హుటిన ద్విచక్ర వాహనంపై కోసికి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక మంత్రాలయం నియోజవర్గం టిడిపి ఇన్చార్జ్ రాఘవేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని యువకుని మరణానికి గల కారణాలు డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబీకులను ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని పార్టీ నాయకులు వాల్మీకి సోదరులు మరణించిన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి మట్టి ఖర్చులు నిమిత్తం 10 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. కాగా మృతుని తల్లిదండ్రులకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్ల సంతానం అందులో పెద్ద కుమారుడైన నాగరాజు అకాల మృతితో కుటుంబీకులు బంధువుల రోదనలో ఆసుపత్రి ఆవరణములో మిన్నంటాయి.
కరెంట్ షాక్ తో యువ రైతు మృతి
RELATED ARTICLES