TEJA NEWS TV: కరువు కరాల నృత్యం వీధి డాన్సులకు పరిమితమైన మంత్రులు.
మంత్రులపై విరుచుకుపడ్డ ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి.
కరువు పర్యటనలో భాగంగా ఒంటిమిట్టలో పర్యటించిన ఆర్ సి పి కరువు బృందం.
తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
స్థలం ఒంటిమిట్ట
రాయలసీమ ప్రాంతం నిత్యం కరువుతో కొట్టుమిటాడుతుందని చేతగాని ముఖ్యమంత్రి పాలనలో దద్దమ్మలు మంత్రులు కావడంతో కరువును పట్టించుకోకుండా కరువు సహాయక చర్యలు చేపట్టకుండా రోడ్లపై డాన్సులకే పరిమితమయ్యారని
రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఒంటిమిట్ట చెరువు వ్యవసాయం కోసమే కాకుండా పర్యాటకంలో కూడా భాగమేననీ అన్నారు. కోదండ రాముని దర్శించుకున్న భక్తులకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించుటలో చెరువు ఎంతో కీలకమైనదని తెలిపారు. నాటి ప్రభుత్వంలో ఈ చెరువు సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా నిండుకుండలా ఉండేదన్నారు. నేడు నీటిపారుదల శాఖ మంత్రి అంబంటి రాంబాబు ఏసీ రూములకు పరిమితం కావడం వలన సోమశిల సముద్రపాలు చేసి, రైతులను, ప్రజలను కన్నీటిపాలు చేశారని ఆయన అన్నారు.
చేర్లోపల్లి పరిసర ప్రాంతంలో 8, 10 సంవత్సరాల వయసున్న నిమ్మ తోట నీరు లేక ఎండిపోయినదని ఇంత తీవ్ర కరువున్న కడప జిల్లాను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం ఎంతో దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు.
జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి జిల్లాలోని కరువుపై సమీక్ష చేయకపోవడం ఎంతో విచారకరమన్నారు. 130 సంవత్సరాలలో అతిపెద్ద కరువు అని చెప్పబడుతున్న, రాష్ట్ర ప్రభుత్వం కరువు లేదని చూపించే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.
ఇప్పటికైనా కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, రైతులకు నష్టపరిహారం, వ్యవసాయ కార్మికులకు 200 రోజుల పని దినాలను, రోజుకు 600 రూపాయలు చొప్పున కార్మికులకు చెల్లించాలని
ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ రైతు సంఘం కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా, రాయలసీమ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తస్లిమ్, లక్ష్మీదేవి, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటేష్, ఆర్ సి పి నాయకులు మడగలం ప్రసాద్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.
కరువు కరాల నృత్యం వీధి డాన్సులకు పరిమితమైన మంత్రులు- ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి
RELATED ARTICLES