Teja news tv : పాల్వంచ మండల కేంద్రంలోని ఫరీద్ పేట్ గ్రామంలో శ్రీ వనదుర్గ పెద్దమ్మతల్లి, పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం రెండో వార్షికోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా పెద్దమ్మ ఆలయంలో కల్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. శనివారము పెద్దమ్మ జాతరలో భాగముగా ఆలయంలోని పెద్దమ్మ పెద్దరాజులకు పట్నాలు గీసి కళ్యాణాన్ని జరిపించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. డప్పు చప్పట్లతో పెద్దమ్మ బోనాలను ముదిరాజులు ఊరేగింపుగా దేవాలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో ఒగ్గు కళాకారులతో ఒగ్గు కథలు చెప్పించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని పెద్దమ్మ పెద్దరాజుల ఆలయాన్ని సందర్శించుకున్నారు.పెద్దమ్మ పెద్ద రాజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి, మరియు యంగ్ డైనమిక్ లీడర్ పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముదిరాజు కులస్తులు వారికి ఘనంగా శాలువలతో సత్కరించారు. పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ వార్షికోత్సవ గత మూడు రోజులనుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని శనివారము లోక కళ్యాణార్థకం పెద్దమ్మతల్లి పెదరాజుల కళ్యాణ మహోత్సవం వేదమంత్రాలు నడుమ ముత్యాల పందిరిలో ఘనంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దమ్మ తల్లికి భక్తులు ఒడి బియ్యం కానుకలు సమర్పించుకున్నారు. అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కాగలరని ముదిరాజ్ సదర సంఘం సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.
కన్నుల పండుగగా పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం
RELATED ARTICLES