భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
01-03-2025
భద్రాద్రి కొత్తగూడెం:
ముస్లింల పవిత్రమైన రంజాన్ మాసం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో ముస్లిం సోదరులు రేపటి నుంచి ఉపవాస దీక్షలు (రోజాలు) ప్రారంభించనున్నారు.
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలకు విశేష ప్రాధాన్యత ఉంది. ముస్లింలు సహర్ (ఉదయం భోజనం) నుంచి ఇఫ్తార్ (సాయంత్రం ఉపవాస విరమణ) వరకు ఉపవాస దీక్షలు పాటిస్తారు.
ఈ మాసంలో ముస్లింలు రోజుకు ఐదుపూటల నమాజు చేస్తారు. ప్రత్యేకంగా రాత్రి తరావీహ్ నమాజులో ఖురాన్ పఠనం నిర్వహిస్తారు.
మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు:
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసేందుకు ఏర్పాట్లుయినట్లు మసీదు నిర్వాహకులు తెలిపారు.
కనిపించిన నెలవంక రేపటి నుంచి రంజాన్
RELATED ARTICLES