Friday, January 24, 2025

కడప జిల్లా: వైసీపీ ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డాయి – టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు జగన్ మోహన్ రాజు



వైయస్సార్ కడప జిల్లా
మండల కేంద్రమైన ఒంటిమిట్ట హరిత హోటల్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు పై వైసిపి ప్రభుత్వం కక్ష పెట్టుకుని అక్రమ కేసు బనాయించినది రానున్న రోజుల్లో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు పార్టీ కృషి కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడుగా పనిచేయాలని కార్యకర్తలకు పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు అన్నారు అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో ఏం జరగలేదని రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు వైసిపికి ఓటు వెయ్యరు అని తెలుసుకొని అరాచకాలు చేస్తూ తిరిగి గద్దె ఎక్కడానికి వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు మాజీ కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా వైసిపి అక్రమాలు, రౌడీయిజాలు అందరూ గమనిస్తూ ఉన్నారని మా నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్టు చేసి నిర్బంధం చేసి ప్రజల్లోకి వెళితే వైసిపి పార్టీకి డిపాజిట్లు రావని గమనించి అక్రమ నిర్బంధం చేశారని న్యాయం మా వైపే ఉందని చంద్రబాబు నాయుడు తిరిగి ప్రజల్లోకి వెళ్లడం ఖాయం వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపడం తథ్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధవటం మాజీ జెడ్పిటిసి సభ్యులు చలమయ్యమాజీ మార్కెట్ చైర్మన్ఎద్దుల సాగర్,మాచపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు పిచ్చిరెడ్డి గాలి సుబ్బయ్య తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular