Monday, February 10, 2025

కంబదూరు మండలంలో తలారి రంగయ్య విస్తృత పర్యటన



– పల్లె పల్లెను పలకరిస్తూ.. జగన్ పాలనను ప్రజలకు వివరించిన ఎంపీ, కళ్యాణదుర్గం వైకాపా సమన్వయ కర్త రంగయ్య




– 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని  ప్రజలను కోరిన

ఎంపీ  రంగయ్య

కళ్యాణదుర్గం తేజ టీవీ న్యూస్


సీఎం జగన్ మోహన్ రెడ్డితోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జిల్లా ఎంపీ, కళ్యాణదుర్గం వైకాపా సమన్వయ కర్త తలారి రంగయ్య పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని  కంబదూరు మండలంలో శుక్రవారం ఆయన విస్తృత పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని పలు  గ్రామాల్లో పర్యటిస్తూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గూర్చి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కంబదూరు , ఒంటారెడ్డి పల్లి, అండేపల్లి, తిమ్మాపురం, మంద ఇతర  గ్రామల్లో పర్యటించిన తలారి రంగయ్య కు ప్రజలు, వైఎస్ఆర్ సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ది సీఎం జగన్ తోనే సాధ్యం ఆయన తెలియజేశారు. ప్రజల ముంగిటికే ప్రభుత్వ పాలన తెచ్చిన ఏకైక  ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన విద్య వైద్య రంగాలు అభివృద్ది చెందాయనీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు తిరిగి అందాలంటే జగన్ మోహన్ రెడ్డిని మరొక సారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు వివరించారు. పల్లెలను పలకరిస్తూ తమ దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular