పత్తి క్వింటాకు కనీస మద్దతు ధర రూ.7,020 /- : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.
అన్నదాతల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృషి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
కంచికచర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సోమవారం ప్రారంభించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారన్నారు. రైతును ఆదుకోవాలనే ఆలోచనతో పంటకు గిట్టుబాటు ధర అందించే విషయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. మధ్య దళారీలను ఆశ్రయించి రైతులు మోసపోవద్దన్నారు. సీసీఐ కూడా ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని సూచించారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, వైఎస్సార్ యంత్ర సేవ, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఇలాంటివి అమలు చేస్తూ జగనన్న రైతుకు అండగా నిలిచారని కొనియాడారు ..
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ..
కంచికచర్లలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
RELATED ARTICLES