TEJA NEWS TV : Reporter Prasad
డోన్ పట్టణం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు డోన్ యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి బివై సుబ్బారాయుడు అద్యక్షతన ఓట్ ఫర్ ఓపిఎస్ పోస్టర్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులందరికీ ఓపిఎస్ ఇవ్వాలన్నారు. ఓపిఎస్ ఇచ్చేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఓట్ ఫర్ ఓపిఎస్ పోస్టర్లు పంపిణీ చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మీ మేనిఫెస్టో లో సిపిఎస్ రద్దు చేస్తామని చేర్చాలని డిమాండ్ చేశారు. ఎవరైతే ఈ డిమాండ్ ను అమలు పరుస్తారో వారికే ఉద్యోగులు సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గోపాల్, సీనియర్ నాయకులు కేశవరెడ్డి,సుదర్శన్,రాణి, ప్రసాద్ ,రామక్రిష్ణ,గంగాధర్, మనోహర్ ,ఇబ్రహీం ,సురేష్,గ్రేసమ్మ, గాలి స్వామి, గోవిందరెడ్డి, వీరారెడ్డి, రాంభూపాల్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, సుజాత, నాయక్, ఇంతియాజ్, మురళి కృష్ణ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి,మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.
ఓపిఎస్ ను మేనిఫెస్టో లో ప్రకటించాలి- డోన్ యూటీఎఫ్
RELATED ARTICLES