కర్నూల్ జిల్లా ఆలూరు తాలుక్ హోళగుంద మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆశా డే సందర్భంగా భోజన విరామ సమయం నందు హోళగుంద వైద్యాధికారి న్యూటన్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు హోళగుంద మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ 9 నెలలు కావస్తున్న ఇంతవరకు ఒప్పంద జీవోలను సర్కులర్లను విడుదల చేయకపోవడంతో ఆశా వర్కర్లు ఆందోళనకు గురవుతున్నారని. వారు అన్నారు ఇప్పటికీ చాలామంది ఆశ వర్కర్లను రిటైర్మెంట్ చేశారని 60 నుండి 62 సంవత్సరాల పెంపుదల జీవో రాకపోవడంతో ఆశ వర్కర్ల ఆందోళన చెందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కూడా అందలేదని ఆశా వర్కర్లు ఈ కాలంలో చాలామంది మరణించడం జరిగిందని వారికి బీమా సౌకర్యం కూడా అందలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒప్పంద జీవులను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని కోసిగి వైద్యాధికారి మనోజ్ కుమార్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ఆశ వర్కర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేయాలి -ఆశా వర్కర్స్ యూనియన్
RELATED ARTICLES