TEJA NEWS TV:
తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
ఒంటిమిట్ట ఎంపిడివో కార్యాలయంలో “జగనన్నకు చెబుదాం” మండల స్థాయి స్పందన కార్యక్రమం*
గ్రామ స్థాయిలోని సమస్యలను.. మండల స్థాయిలోనే అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని.. జి.గణేష్ కుమార్ అధికారులకు సూచించారు.
బుధవారం ఒంటిమిట్ట ఎంపిడివో కార్యాలయంలో.. మండల స్థాయి “జగనన్నకు చెబుదాం” స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి.గణేష్ కుమార్ తో పాటు.. కడప ఆర్డీవో మధుసూదన్, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యూష హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. వాలంటరీలు జీతాలు పెంపు కొరకు పత్రం సమర్పించారు
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు గ్రామ స్థాయి సమస్యలు.. మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే దిశగా.. మండల స్థాయిలో ప్రతి బుధ, శుక్ర వారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కో మండలంలో.. “జగనన్నకు చెబుదాం” కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు . ప్రజల సమస్యలకు మెరుగైన, వేగవంతమైన పరిష్కారం అందించే దిశగా ఈ కార్యక్రమం అమలు జరుగుతోందన్నారు. అర్హతలు ఉండి ప్రభుత్వ పథకాలు అందుకోలేని వారు.. వెంటనే వారి పరిధిలోని సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించి ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలన్నారు. “జగనన్నకు చెబుదాం” కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జేసీ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
ఒంటిమిట్ట మండల స్థాయిలోనే స్థానిక సమస్యల పరిష్కారం – జాయింట్ కలెక్టర్ జి.గణేష్ కుమార్
RELATED ARTICLES