తేజ న్యూస్ రిపోర్టర్
దాసరి శేఖర్
ఒంటిమిట్ట నవంబర్ 25
ఒంటిమిట్ట మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్త మాధవరం లో శనివారం ముందస్తు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 26న ఇండియా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోందన్నారు. దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారన్నారు . 1949 నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగాన్ని దత్తత చేసుకుందన్నారు. అంటే భారత రాజ్యాంగ అసెంబ్లీ రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. ఐతే ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని మాత్రమే దేశ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటున్నారు. ఈ రాజ్యాంగ దినోత్సవం కొత్తది కావడంతో దీనికి అంతగా ప్రాచుర్యం కలగలేదన్నారు. 2015 నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 11న ముంబైలో సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పునాది రాయి వేస్తూ ఈ ప్రకటన చేశారన్నారు. 2021లో అంబేద్కర్ 131వ జయంతి జరిగింది. భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించిన రాజ్యాంగ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు.ఇది వరకు నవంబర్ 26న లా డే గా జరుపుకునేవారు. నవంబర్ 26న రాజ్యాంగం ప్రాధాన్యం, అంబేద్కర్ ఆశయాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రతి ఒక విద్యార్థి భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలనిఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట: ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES