TEJA NEWS TV :
*నిరుపేదలకు అండగా నిలిచిన ఆపాద్భాంధవుడు..!*
*కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ.
కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు *శ్రీ. సుధాకర్ బాబు ఆదేశాల మేరకు భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 79వ జయంతి వేడుకలు *ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ* ఆధ్వర్యంలో చిప్పగిరి మండల కేంద్రంలోని ఆర్.డి.టి స్కూల్ నందు కేకు కట్ చేసి చిన్నారుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేశారని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనకే చెందుతుందని టెక్నాలజీ రంగం రాజీవ్ గాంధీ హయాంలోనే అభివృద్ధి చెందిందని వారు తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు అండగా నిలిచి 3 లక్షల రూపాయలు రుణమాఫీ, వృద్ధులకు నెలకు 4000/- పింఛన్, 500/- లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కరెంటు గోవిందు, చిప్పగిరి వినోద్ కుమార్, బాలరాజు, రమేష్, శివన్న, లక్ష్మన్న, రామచంద్ర, శివ, దివాకర్ పెద్ద ఎత్తున చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
ఐటీ రంగానికి పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ..!
RELATED ARTICLES