సంగెం మండలం తీగరాజుపల్లె గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నందు పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు” * ఏ వి ఆర్, ఫౌండేషన్* “వ్యవస్థాపకులు * సోమిడి రమాదేవి -అంజన్ రావు* పదవ తరగతిలోని మొత్తం 12మంది విద్యార్థులకి 25,000/- రూపాయలు విలువ చేసే వి జి ఎస్, గైడ్స్ సబ్జెక్ట్స్ వారిగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా సోమిడి ,అంజన్ రావు మాట్లాడుతూ, జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థానాలను చేరడానికి పదవ తరగతి అనేది తొలి మెట్టు అని, విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళిక పరంగా చదివితే ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 10/10 జిపిఏ సాధించవచ్చునని అన్నారు , ఏ వి ఆర్, ఫౌండేషన్ ద్వారా స్టడీ మెటీరియల్ అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవ కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామం లోని సొలగుడి ప్రమోద్ , రంగరాజు అశోక్, ఐత కుమార్, హంస అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఏ వి ఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా వి జి ఎస్ గైడ్స్ పంపిణీ
RELATED ARTICLES