యన్టీఆర్ జిల్ల నందిగామ
యన్టీఆర్ జిల్ల నందిగామ ఏరియా ప్రభుత్వ వైధ్యశాల లో నందు ప్రతి నెల 9 వ తారీఖున గర్భిణీ స్త్రీలకు పమ్సా ప్రోగ్రాం జరుగుతుంది. దీనిలో భాగంగా సోమవారం రోజన గర్భిణీ స్త్రీలకు ఆహారం మరియు పౌష్టికాహార పంపిణీ అందించే ఈ కార్యక్రమం ను వైధ్యశాలలో ని డాక్టర్ల తో కలిసి ఛైర్మన్ వేపూరి నాగేశ్వరరావు నిర్వహించడం జరిగినది. అంబారు పేట శ్రీ సద్గురు బోదానందస్వామి చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో గర్భిణీ స్త్రీలకు భోజనం మరియు పౌష్టికాహారం ఏర్పాటు చేయడమైనది. ప్రతినెలా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమము నచ్చి శ్రీ సద్గురు బోదానంద స్వామి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక నుండి ప్రతి నెల 9 వ తేదీ న పౌష్టికాహారం ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలియజేశారు .
ఈ కార్యక్రమం లో శ్రీ బోధనంద స్వామి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, భక్తులు, మరియు వైధ్యశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ వేపూరి నాగేశ్వరరావు ,సూపరింటెండెంట్ డాక్టర్ . సత్యనారాయణ , సీనియర్ గైనకాలజిస్ట్ లు డాక్టర్.సీతారావమ్మ , డాక్టర్. మాధవిలత , ఇతర వైధ్య అధికారులు మరియు హెడ్ నర్సులు, సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, తదితరులు పాల్గొన్నారు.
ఏరియా వైధ్యశాల లో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేసిన ఛైర్మన్ వేపూరి నాగేశ్వరరావు
RELATED ARTICLES