ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రం కృతమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ” ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జాతీయ సేవా పథకాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ దినోత్సవం నీ పురస్కరించుకొని NSS కోఆర్డినేటర్ సిహెచ్. వెంకటయ్య నేతృత్వంలో కళాశాల విద్యార్థులతో అధ్యాపకులతో కళాశాల ప్రాంగణమంతా శుభ్రపరిచారు. దానిపై విద్యార్థులకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళాశాల ప్రధాన ఆచార్యులు డాక్టర్ బి రేణుక పాల్గొని విద్యార్థులకు జాతీయ సేవా విధానము గురించి దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులు అధ్యాపకులు కలిసి కళాశాల ప్రాంగణంలో చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించి కళాశాలలోని ఉన్న రోడ్లను పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు Dr.D. నవీన్, Dr.P.జ్యోతి, ఫాతిమా, సంపత్, మున్ని,రమేష్, శేఖర్,జీవ వేణి మరియు ఇతర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని సేవ దినా కార్యక్రమాన్ని విజయవంతంచేశారు.
ఏటూరు నాగారం డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ సేవా దినోత్సవం
RELATED ARTICLES