ములుగు జిల్లా ఎటునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన ఆచార్యులు డాక్టర్ బి రేణుక జాతీయ పతాకాన్ని ఎగరవేసి , మహనీయుల ప్రాణ త్యాగాలకు వచ్చిన స్వతంత్రాన్ని గూర్చి జెండా ఆవశ్యకతను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. స్వతంత్ర సమరయోధుల గురించి విద్యార్థులతో చర్చించారు. నేటి స్వతంత్రం ఎందరో మహనీయుల ప్రాణ త్యాగం అని కొనియాడారు. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులం అని ఎంతోమంది మహనీయులు గొంతెత్తి బ్రిటిష్ వారి గడీలను బద్దలు కొట్టి ప్రాణార్పణ చేసి స్వతంత్రాన్ని మనకు ఇచ్చారని మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వతంత్రం వారిచ్చిన బిక్ష అని తెలిపారు. అటువంటి స్వతంత్రాన్ని ప్రతి సంవత్సరం జెండా ఎగరవేసి దేశం కోసం మరణించిన మహనీయులను స్మరించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ మేరకు వివిధ పోటీలలో గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం వచ్చిన వారందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు, డాక్టర్ బి.రేణుక మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ఏటురునాగారం మండల కేంద్రంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES