భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
-తేజ న్యూస్ టీవీ
10-07-2025
భద్రాద్రి కొత్తగూడెం:
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్‌లో తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితను సేవాలాల్ సేన జిల్లా కమిటీ నాయకులు కలిశారు. జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏజెన్సీ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
గిరిజనుల ప్రత్యేక ఆచార వ్యవహారాలు, జీవన విధానాల రక్షణకు 1/70 యాక్ట్, పీసా చట్టాలు, ఐదవ షెడ్యూల్ కీలకం అని నేతలు వివరించారు. అయితే నేటి ప్రభుత్వ అధికారులు ఈ చట్టాలను అమలు చేయకుండా గిరిజనులపై అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్, జీవి మాల్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ వంటి కార్పొరేట్ సంస్థలు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ మైదాన ప్రాంతాల మాదిరిగా మాల్‌లు స్థాపించి అమాయక గిరిజనులను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని చైర్మన్ పదవులు స్థానిక గిరిజనులకే ఉండాలన్న రాజ్యాంగ నిబంధనలను అధికారులు పక్కన పెట్టి గిరిజనేతరులకు కట్టబెట్టారని విమర్శించారు. పాల్వంచ పెద్దమ్మ గుడి, భద్రాచలం గుడి చైర్మన్ పదవులను గిరిజనేతరులకు కట్టబెట్టినట్లు గుర్తు చేశారు.
అలాగే షెడ్యూల్ ఏరియాలో ఉద్యోగాల లేవని, భద్రాచలం ఐటిడిఏలో ఏజెన్సీ డీఎస్సీ జరుగక గిరిజన నిరుద్యోగులు విస్తరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఎమ్మెల్సీ కవితను కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవి రాథోడ్, భూక్య సంజీవ్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు బాలు నాయక్, కిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీ చట్టాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వినతి
RELATED ARTICLES



