Tuesday, January 14, 2025

ఏకసభ్య కమీషనర్‌ కు వినతి పత్రం అందజేసిన మిత అయ్యళ్వార్ సంఘం జిల్లా నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
31-12-2024



కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ పై ఒక సవివర అధ్యాయాన్ని నిర్వహించడం కోసం విచా రణ కమిషన్ నివేదికను చేపట్టింది.కుల గణన వర్గీకరణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని షెడ్యూల్డ్ మిత అయ్యళ్వార్ ఎస్సీ (48) కులానికి చెందిన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బూరుగుల రామకృష్ణ భవన్ లో ఏకసభ్య కమిషనర్ డాక్టర్ జస్టిస్ షమీస్ అక్తర్ (తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ జడ్జి ఎంక్వైరీ కమిషన్)ని కలసి కుల వర్గీక రణలో మిత అయ్యళ్వార్ ఎస్సీ కులానికి చెందాల్సిన రిజర్వేషన్ లను, కులానికి తగిన గుర్తింపు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు పందిళ్ళపల్లి వెంకటే శ్వర్లు ఉపాధ్యక్షులు తుమ్మ కొమ్మ వెంకటే శ్వర్లు ప్రధాన కార్యదర్శులు మేకల మోహ న్ రావు యర్నం శ్రీనివాసరావులు కోశాధి కారి తాళ్లూరి రామదాసులు మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా కుల జనాభా సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అన్ని జిల్లాలో మా కులం అభివృద్ధి చెందక పేదరికంలోనే ఉన్నాయన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో మిత అయ్యళ్వార్ ఎస్సీ కుల సంఖ్య ఉందని గ్రామాల వారిగా అతి తక్కువ కుటుంబాలు మాత్రమే ఉంటా యని తెలిపారు.మిత అయ్యళ్వార్ ఎస్సీ
మా కులవృత్తి పౌరోహిత్యం,అర్చకత్వం, ఆయుర్వేదిక వైద్యం,హరికథలు,బుర్రక థలు చెబుతూ జీవనో పాది పొందుతా మన్నామని తెలిపారు.మా కులస్తులు నిత్యము నుదుటన త్రినామం ధరించి శ్రీ మహావిష్ణువును పూజిస్తూ గ్రామాలలో సనాతన హిందూ ధర్మ ప్రచారం చేయడం మాల కులస్తులకు కుల గురువులుగా వ్యవహరిస్తూ వాళ్లకు పంచాంగ శ్రవణం చేయడం,వివాహాలు దశది నకర్మలు జరి పించి వాళ్ళు ఇచ్చిన సంభా వనతో కు టుంబాలు పోషించుకునే వాళ్ళ మన్నా మని తెలిపారు.మా పూర్వీకుల కాలం నాటి నుండి నేటి వరకు పౌరో హిత్యం చేస్తూ నేటికీ ఎన్ని కుటుంబాలు అభివృ ద్ధికి నోచుకోక వెనుకబడే ఉన్నా మన్నా రు.మేము నేటికీ విద్యా,ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో వెనుక బడే ఉన్నా మన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యా ప్తంగా ఉన్న మాకు మిత అయ్య ళ్వార్ ఎస్సీ కుల దృవీకరణ పత్రాలు ఇవ్వాలని కోరారు.గతంలో జరిగిన రిజర్వేషన్ లో మిత అయ్యళ్వార్ ఎస్సీ (48) కులానికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారని ఇప్పు డు జరుగుతున్న కుల వర్గీకరణలో ఐదు శాతం రిజర్వేషన్ పెంచాలని ఏకసభ్య ఎంక్వైరీ  కమిషనర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చి న కార్యక్రమంలో గుర్రం వెంకట దాసు, పొత్తూరి శ్రీనివాసరావు,తోకల శంకర్, తాళ్లూరి శివ,జెట్టి దినేష్, ఖమ్మం జిల్లా తరఫు నుండి గోవర్ధనగిరి దశరథ,గుజ్జు శ్రీకాంత్,సూర్యాపేట జిల్లా నుండి కామళ్ళ కృష్ణ తదితరులు పాల్గొ న్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular