Saturday, January 18, 2025

ఎస్. సి సబ్ ప్లాన్ పధకం కింద యస్. సి కుటుంబాలకు టార్పాలీన్ షీట్లు పంపిణీ

*ఎస్. సి సబ్ ప్లాన్ 2023 -24 పధకం కింద జాతీయ వ్యవసాయ పరిశోదనా నిర్వహణ సంస్థ ( NAARM) వారు 330 యస్. సి కుటుంబాలకు టార్పాలీన్ షీట్లు, వ్యవసాయ ఉపకరణాలు అందించటం ఆనందకరం :-మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి

*పెద్దకడుబురు మండల వ్యవసాయ అధికారి యం. వర ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ పరిశోదనా నిర్వహణ సంస్థ, హైదరాబాద్ ( NAARM) వారి సహకారంతో మండల పరిధిలోని హెచ్. మురవణి గ్రామంలో యస్. సి రైతులకు టార్పాలీను షీట్స్ మరియు వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ యన్. రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి  యన్. రమాకాంత్ రెడ్డి, టీడీపీ మండల కోఆర్డినేటర్ బసలదొడ్డి ఈరన్న, టీడీపీ నాయకులు విజయ్, హనుమంత్ రెడ్డి,  యోసేపు , మల్లికార్జున,గ్రామ రైతులు* మరియు
NAARM సంస్థ ప్రతినిధులు
1. *Dr యం.బాలకృష్ణన్ , చైర్మన్ , ఎస్సి సబ్ ప్లాన్*
2. _Dr యం.రమేష్ నాయక్ , శాస్త్రవేత్త_
3. *Dr విజేందర్ రెడ్డి , టెక్నికల్ ఆఫీసర్*
4. _Dr లక్ష్మణ్ అహిరే , టెక్నికల్ ఆఫీసర్_
5. _Mr శేఖర్ రెడ్డి , టెక్నికల్ ఆఫీసర్ పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ పెద్దకడుబురు మండలంలో నాయొక్క మొదటి బహిరంగ సమావేశం యస్. సి రైతులకు వ్యవసాయ ఉపకారణాలు అందించేదిగా ఉండటం శుభపరిణామమని మున్ముందు బడుగు బలహీన వర్గాలకు మరింత చేరువయ్యేవిదంగా ఉండటానికి దోహదపడుతుందని, మంత్రాలయం నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమని అందులో యస్. సి రైతులు మరింత వెనుకబడ్డారని ఇలాంటి ప్రాంత రైతులను గుర్తించుటలో సహకరించిన పెద్దకడుబురు మండల వ్యవసాయ  అధికారి యం. వర ప్రసాద్, ఉపకరణాలు అందించిన  నార్మ్ సంస్థ వారికి మురవణి రైతుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయటానికి మావంతు సహకారం అందిస్తామని తెలిపారు.

  నరవ రమాకాంత్ రెడ్డి  బసలదొడ్డి ఈరన్న మల్లికార్జున విజయ్ , యేసేబు మాట్లాడుతూ మంత్రాలయం నిజయోజక వర్గం రైతులు ఎప్పుడు కరువు కాటకాలతో ఇబ్బంది పడుతుంటారని ఇక్కడకు వచ్చిన శాస్త్రావేత్తలు కరువు నివారణ కార్యక్రమాలు మరియు తక్కువ నీటితో పండించే పంట రకాల విత్తనాలు ఉచితంగా ఇవ్వటం, డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహంచే విదంగా 100% సబ్సిడీలో ఇవ్వటం, డ్రోన్లు పంపిణీ చెయ్యటం వంటివి చేపడితే రైతుల స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు మున్ముందు ఇలాంటి పధకాలు మండల రైతులకు మరిన్ని అందేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular