హొళగుంద మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో ఎంతగానో ప్రసిద్ధ గాంచిన షేక్షావలి శేషావలి గంధం వేడుకలు చూడడానికి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర నుండి భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. హొళగుంద నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఎల్లార్తి గ్రామంలో వెలిసిన షేక్షావలి షాషావలి దర్గాకు అనేక దూర ప్రాంతాల నుండి మొక్కులను తీర్చుకునేందుకు తరలి రావడం జరుగుతుంది . ఇక్కడ వచ్చిన భక్తులకు తెల్లవారుజామున దర్గా పీఠాధిపతులు పూర్వ ముత్తా వలి సయ్యద్ నూర్ బాబా గంధాన్ని గ్రామ వీధుల వెంట ఊరేగింపు చేపట్టారు. అనంతరం ఊరేగింపు చేస్తూ దర్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామి గంధాన్ని పొందేందుకు వేలాదిమంది భక్తులు పోటీ పోటీపడ్డారు. గంధం ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది తరలివచ్చిన జనం అనంతరం సయ్యద్ నూరు బాబా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకొని ప్రశాంతంగా జీవితం కొనసాగాలని భక్తులకు వారు తెలియజేశారు. అదేవిధంగా ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వీరభద్ర గౌడ్ షేక్షావలి షాషావలి దర్గాల ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించరు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ వచ్చిన ప్రజలకు దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు
నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఎల్లార్తి దర్గా ఎంతగానో ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రమని వారు తెలియజేశారు. ఎల్లార్తి దర్గా వర్క్ బోర్డ్ ఈవో ఇమ్రాన్. వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ సయ్యద్. ఆలూరు సీఐ శ్రీనివాస్ నాయక్. హొళగుంద ఎస్సై బాల నరసింహులు. ఆధ్వర్యంలో పోలీస్ బంద్ బస్తూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జాకీర్ మోహిన్. భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఎల్లార్తి లో షేక్షవాలి షాషావాలి గంధం వేడుకలు
RELATED ARTICLES