*ఎల్లార్తి దర్గా ఉరుసు పోస్టర్ విడుదల చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు*
*ఈ నెల 12న దర్గా ఉసురు మహోత్సవం*
*ఎల్లార్తి దర్గా ఉసురును భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయండి*
*రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం*
కర్నూలు జిల్లా హోళగుంద మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన హజరత్ షేక్ షావలి సాహెబ్ మరియు హజరత్ షా షా వలి సాహెబ్ 361వ ఉసురు మహోత్సవం ఈ నెల 11వ తేదిన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఆలూరు పట్టణంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎల్లార్తి ఉసురు సంబంధించిన పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మరియు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఫర్విన్ భాను మరియు ఆలయ నిర్వహణ అధికారి అబ్దుల్ రహీమ్ తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన ఎల్లార్తి దర్గా ఉసురు మహోత్సవం ఈ నెల11వ తేది నుంచి 13వరకు నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు త్వరలో పూర్తి చేయడం జరిగిందని అని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ అన్నదమ్ములా పండుగ వాతావరణంలాగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు, ఎల్లార్తి మాజీ సర్పంచ్ మల్లికార్జున , పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లార్తి దర్గా ఉరుసు పోస్టర్ విడుదల చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు
RELATED ARTICLES