TEJA NEWS TV
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని రుద్రవరం మండల కేంద్రం పొలిమేరలో వెలసిన ఎల్లమ్మ దేవత నూతన దేవాలయ నిర్మాణానికి తన వంతు ఆర్థిక సహాయంగా రుద్రవరానికి చెందిన మొల్క ప్రసాద్ 10 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా ఆలయ నిర్మాణ కర్త కమతం తాటి రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కమతం తాటిరెడ్డి మాట్లాడుతూ పూర్వం నుండి గ్రామ దేవతగా పిలువబడుతూ రుద్రవరం గ్రామంలో దేవర అనంతరం మరుసటి రోజున పెద్ద ఎత్తున ఇక్కడ ఎల్లమ్మ కి దేవర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అలాంటి మహిమగల అమ్మవారికి పొలిమేర రెడ్డి అయిన తమ తండ్రి పెద్ద గుర్రెడ్డి తమ పొలంలో వెలిసింది కావున తమ పొలాన్ని 1.55 సెంట్లు అమ్మవారికి కేటాయించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పూర్వం నుంచి పెట్టుడు బండల మధ్య అమ్మవారు ఉందని అమ్మవారికి గుడి కట్ట దలసి 55 సెంట్ల లో గుడి నిర్మాణం పనులు చేపట్టినామని అమ్మవారి కరుణ కటాక్షం మరియు ఆశీస్సులతో భక్తులు తమ వంతు విరాళాలు అందించి గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఎల్లమ్మ నూతన ఆలయ నిర్మాణానికి 10000 ఆర్థిక సహాయం
RELATED ARTICLES