


TEJA NEWS TV :
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఎమ్మెస్సార్ కార్యాలయం నందు సంక్రాంతి పండుగా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి యూత్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలలో పాల్గొన్న ముగ్గుల పోటీ దారులను విజేతలుగా నిర్ణయించుటకు జెడ్జి నిర్ణేతలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి సతీమణి మన్నే మల్లీశ్వరమ్మ, డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు సతీమణి చాటకొండ సునీత,మన్నె భారతి, కొండా ఉషారాణి,శాలిని ప్రకాష్, శకుంతల లు పాల్గొన్నారు.
వీరు పోటీలలో పాల్గొన్న ముగ్గుల పోటీ దారులు వేసిన ముగ్గులను పరిశీలించి ఆరుగురు విజేతలను ప్రకటించి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ కుమార్ రెడ్డి, డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈరోజు ఎమ్మెస్సార్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని ఈ పోటీలలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెస్సార్ యూత్ తరఫున చిరు బహుమతులను అందజేయడం జరిగిందని అలాగే ముగ్గుల పోటీదారులలో మొదటి ఆరు మంది విజేతలకు బహుమతి ప్రధానోత్సవాలను అందించడం జరిగిందని ఇలాగే ప్రతి సంవత్సరం ఎమ్మెస్సార్ యూత్ తరఫున ప్రజలకు సేవ చేయటం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధర్మవరం మన్నే భరత్ కుమార్ రెడ్డి,సిటీ కేబుల్ కిరణ్,చనుగొండ్ల కాశి, బబ్లు యాదవ్,ఇతర టిడిపి నాయకులు,మహిళలు పాల్గొన్నారు.



