ఎమ్మెల్యే సారు ఓ సారి మా వీధులు చుడండి: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కడివేటు రమణయ్య
మీరు భూమి పూజ చేసి సరిగ్గా 6 నెలల అయినా ఇంకా ప్రారంభం కానీ పనులు
వర్షం తగ్గి నాలుగు రోజులు అవుతున్న మా ఇండ్లలో తగ్గని వర్షపు నీరు సారు
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మేజర్ పంచాయితీ లో హరిజనవాడ,అరుంధతి వాడ,బలిజపాలెం,శాటిలైట్ కాలనీలో మురుగు కాలువలు లేక రోడ్లపైనే మురికి నీరు నిలుస్తుండటంతో,ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం పట్టించుకోవాలి.మురుగు కాలవ నిర్మాణానికి 70 లక్షల రూపాయలు మంజూరు చేశారు అని అందులో భాగంగా గడపగడప కార్యక్రమంలో మురుగు కాలువ నిర్మాణానికి అట్టహాసంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదగా జూన్ 2వ తేదీన భూమి పూజ చేసారు. ఇప్పటికీ 6 నెలలు కావస్తున్న పనులు మాత్రం ప్రారంభం కాలేదు. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాల వలన మురుగునీటితోపాటు వాన నీరు కూడా హరిజనవాడలోనీ కొన్ని విధులలో రోడ్ల పైన నిలిచిపోవడంతో ఎటు పోలేక ఇండ్లలోకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మంజూరి అయిన నిధులు ఏమయ్యాయి..?
మురుగు కాలువ నిర్మాణానికి 70 లక్షలు మంజూరు అయ్యాయని చెప్పి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరియు స్థానిక వరదయ్యపాలెం మండల స్థాయి నాయకులు, ఎంపీటీసీలు సర్పంచ్లు , వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్న గడపగడప కార్యక్రమంలో ఆడంబరంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే నిధులు మంజూరు అయ్యి ఇప్పటికీ 6 నెలలు కావొస్తున్న ఆ పనులు ఎందుకు ప్రారంభం కాలేదో ఎవరికి తెలియదు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే ఈ సమస్యపై ద్రుష్టి సారించి మంజూరు అయిన నిధుల ద్వారా మురుగు కాలవ నిర్మాణం అయ్యే విధంగా చొరవ చూపి తమ ఇబ్బందులను తొలగించి ప్రజలు రోగాల భారిన పడకుండా త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను
ఎమ్మెల్యే సారు ఓ సారి మా వీధులు చూడండి
RELATED ARTICLES