హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి ని, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్య ను నల్లగొండ- ఖమ్మం- వరంగల్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే అభ్యర్థి తీన్మార్ మల్లన్న కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ రావాలని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి డా. కడియం కావ్య ని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
RELATED ARTICLES