జనసేన పార్టీ
ఎన్టీఆర్ జిల్లా
నందిగామ నియోజకవర్గం
విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న తంబళ్ళపల్లి రమాదేవి
ఎన్డీయే కూటమి 2047వరకు జోరుగా కొనసాగుతుందన్న జనసేన రమాదేవి
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సంధర్భంగా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జుజ్జురు గ్రామంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ప్రభుత్వ విప్,నందిగామ నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి పాల్గొన్న నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు. ఈ సంధర్భంగా రమాదేవి గారు మాట్లడుతూ గత ఏడాది ఇదే రోజున ఎన్డీయే కూటమి ప్రభుత్వం సాధించిన విజయాన్ని నేటికి సంవత్సరం కాలం పూర్తి చేసుకొని నేడు జుజ్జురులో కూటమి నేతలు సగర్వంగా విజయోత్సవ సంబరాలు చేసుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు. ఈ విజయం వెనుక ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు,సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి శక్తీ,యుక్తులతో ఏర్పడిన ఎన్డీయే కూటమి 2047వరకు జోరుతో కొసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకి చేరేలా ప్రజల అశీసులు ముగ్గురి నాయకులకు ఉండేలా పదికలాల పాటు చల్లగా ఉండాలని కోరారు. కొత్త విద్యా సంవత్సరం వేళ,NDA కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రతి తల్లికీ లబ్ధి పొందుతున్నారని దాదాపు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 8745 కోట్లు జమ చేయనున్నట్లు తెలియజేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్లో స్పౌజ్ కేటగిరీ కింద 71,380 మందికి కొత్తగా మంజూరైన పెన్షన్ లను నియోజకవర్గంలోని లబ్దిదారులకు స్వయంగా అందించి ఎన్డీయే కూటమి వర్ధిల్లాలని అన్నారు. ఈ విజయోత్సవ ర్యాలీలో జనసేన పార్టీ వీరులపాడు మండల అధ్యక్షులు బేతపూడి జయరాజు,జుజ్జురు జనసేన నాయకులు వరకుమార్,సీనియర్ నాయకులు బొమ్మిశెట్టి భాస్కరావు,దేవిరెడ్డి శ్రీనివాస్,సురేష్,కోటి,అరవింద్,కొట్టె బద్రి,షేక్ రహీంమతుల్లా,కంభంపాటి తిరుమలరావు,జుజ్జురు జనసైనికులు,వీరులపాడు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం పదికాలాలపాటు చల్లగా ఉండాలి : జనసేన రమాదేవి
RELATED ARTICLES