Wednesday, January 15, 2025

ఎన్టీఆర్ జిల్లా: బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం

ఎన్టీఆర్ జిల్లా కంచి చర్ల మండలం.

ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జి కొండూరు మండలం కందుల పాడు గ్రామకమిటి సమావేశం 3-11-2023 నా సాయంత్రం జరిగింది

ఈసమావేశానికి ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షకార్యదశ్రులు జిహరికృష్ణారెడ్డి షేక్ పమీరావలి జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల కుమార్ హాజరై నారు

ఈసమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పని భద్రతకోసం ఏన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న సంక్షేమబొర్డు పనిచేస్తున్న ప్రమాదాల బారినపడ్డ కార్మికులకు మాత్రం నష్ఠపరి‌హరాలు ఇవ్వకుండా 1214 సర్కులర్ ను ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను నిలిపివేశిన రాష్ట్ర ప్రభుత్వం

భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరుబాట నడవాలని ఏన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ప్రమాదాల బారినపడ్డ భవన నిర్మాణ కార్మికులకు నాలుగున్నర సంవత్సరాలు గా నష్టపరిహారాలు ఇవ్వకుండ ప్రమాదాల బారినపడ్డ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడవేసింది

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ బోర్డు నుండి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పై పోరుకు సిద్ధం అవ్వాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారించకపోతే రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ఆగ్రహనికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈసమావేశాని హాజరైన భవన నిర్మాణ కార్మికులు 30మందీ సంక్షేమ బోర్డు లో సభ్యులు గాచేరేందుకు సిద్దమైనారు

*ఈసమావేశాని కందుల పాడు గ్రామకమిటి అధ్యక్షకార్యదర్శులు నరసింహారావు రవి మరియు కందులపాడు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు*

*కందుల పాడు గ్రామకమిటి నుండి వెంకటేశ్వరరావు ను ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులుగా తీసుకోవటం జరిగింది*

*ఈసందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కందులపాడు జి కొండూరు మండలంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరిని ఒక్క త్రాటి పైకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular