TEJA NEWS TV: ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు న విజయవాడ తూర్పు సిటీలో చిన్న వంతెన సెంటర్ దగ్గర వీరబ్రహ్మేంద్రస్వామి మండపంలో జరిగింది ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు జి హరికృష్ణ రెడ్డి అధ్యక్షతన జరిగింది*
*ఈ సమావేశంలో జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇసుక సంక్షేమ బోర్డు అమలు 12 14 సర్కూలర్ రద్దు 2022 సభ్యత్వాలు యూనియన్ యాన్యువల్ రిటర్న్స్ సంక్షేమ బోర్డులో చేరిన కార్మికులకు ఇవ్వవలసిన కొత్త కార్డులు సంక్షేమ బోర్డులో చేరిన కార్మికుల రెన్యువల్ నష్టపరిహారాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగాచర్చించి పలు కార్మికులు కార్మిక నాయకులు తదితరులు పలు తీర్మానాలు ఆమోదించడం జరిగింది*
*1.వాటిలో ప్రధానంగా ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలి భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ని అమలు చేసి 1214 సర్క్యులర్ను రద్దుచేసి నాలుగున్నర సంవత్సరాలుగా ప్రమాదాల బారిని పడ్డ కార్మికులకు తక్షణమే నష్టపరిహారాలు ఇవ్వాలని సంక్షేమ బోర్డునుండి దారి మళ్లీన నిధులను తక్షణమే సంక్షేమ బోర్డులో జమ చేయాలని ఈ అంశాలపై కార్మిక శాఖ మంత్రి కి వినతిపత్రం ఇవ్వాలని ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే చలో విజయవాడ కార్యక్రమం చేయాలని యూనియన్ ఏకగ్రీవంగా తీర్మానించింది*
*2. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో చేరిన కార్మికులకు జిల్లాలో రావలసిన వేలాది కార్డులను తక్షణమే ఇవ్వాలని డి సి ఎల్ ఆఫీసు ముందు ధర్నా చేయాలని ఈ సమావేశం తీర్మానించింది.*
*3. 2024 మే నెల వచ్చేనాటికి విజయవాడ సిటీ తోసహ మిగిలిన 15 మండలాల్లో అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీ ఏర్పాటు చేయాలని మేడేకి అన్ని మండలాల్లో BCWUజెండాలను ఎగరవేయాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.*
*4. విజయవాడ తూర్పు సీటీ నుంచి జిల్లా కమిటీ సభ్యులుగా రాణి గారి తోట నుండి క్రాంతి పడమట సెంటర్ నుండి సిద్ధారెడ్డి రామలింగేశ్వర నగర్ నుండి మల్లేశ్వరరావును జిల్లా కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది*
*సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి. హరి కృష్ణారెడ్డి షేక్ మీరావాలి మాట్లాడుతూ మన యూనియన్ స్థాపించిన సంవత్సర్నర దాటింది ఈ సంవత్సరం కాలంలో ప్రమాదాలు బారిన పడ్డ కార్మికులు మరణించిన కాళ్లు చేతులు విరిగిన వారికి యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించి వారికి నష్ట పరిహారాలు ఇప్పించడం జరిగింది ఈరోజుకి మన యూనియన్ లో విజయవాడ అర్బన్ సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ మూడు వేల మందితో మన యూనియన్ లో చేరారు అట్లాగే విజయవాడ తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గం తో పాటు నందిగామ వీరులపాడు చంద్ర పాడు మండలాల్లో ఇప్పటివరకు సుమారుగా 2000 సభ్యత్వం యూనియన్కి చేరింది మన యూనియన్ లో పనిచేస్తున్న నియోజకవర్గ మండల గ్రామస్థాయి నాయకులు అందరూ కూడా రేపు మేడే వచ్చేసరికి విజయవాడతోపాటు మిగిలిన 15 మండలాల్లో కూడా ఏరియాలో వారిగా మండలాల వారీగా గ్రామాల వారీగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ నాలుగు నెలల్లో మనందరం కలిసి పూర్తి చేయాలని పిలుపునివ్వడం జరిగింది*
*ఒక కార్పెంటర్ మేస్త్రి కి తల పగలటం వల్ల మన యూనియన్ ఆధ్వర్యంలో ఫండ్ వసూలు చేసి 40,000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది వన్ టౌన్ లో కార్మికుడికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఇబ్రహీంపట్నంలో ఒక కార్మికుడికి 7000 మరో కార్మికుడికి 5000 అట్లాగే వీరులపాడు మండలంలో కొనతాలపల్లి గ్రామంలో ఒక్క కార్మికుడికి 5000 మరోక కార్మికుడికి 5000 ఆఏరియాలలో యూనియన్లు ఆర్థిక సహాయం అందజేసారు.*
*మన యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ గ్రామ కమిటీలు గాని మండల కమిటీలు గాని తక్షణమే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలి యూనియన్ కి సంబంధించిన లావాదేవీలన్నీ చెక్కు రూపంలోనే జరగాలి 2022 జిల్లా మెంబర్షిప్ త్వరగా పూర్తి చేసి జిల్లా సెంటర్కు అందజేయాలి మన ముందు న లక్ష్యాలను మనమందరం కచ్చితంగా అమలుపరిచే దానికోసం కృషిచేసి మన యూనియన్ బలోపేతానికి అందరం పని చేయాలని తెలియజేశారు*
*ఈ సమావేశానికి విజయవాడ తూర్పు సిటీ నుండి మీరావాలి క్రాంతి పశ్చిమ సిటీ నుండి పెద్దిరాజు బ్రహ్మయ్య సెంట్రల్ సిటీ నుండి సుబ్బారావు వాసు నందిగామ నియోజకవర్గం నుండి జి హరికృష్ణ రెడ్డి రాయప్ప జిన్నేపల్లి స్వామి కోయ నాగభూషణం కాకుమాను రామారావు మైలవరం నియోజకవర్గం నుండి కొప్పుల కుమారు జాన్ వెస్లీ వెంకటేశ్వరరావు విజయవాడ రూరల్ నుండి ఎస్ మధు మరియు విజయవాడ తూర్పు సిటీ, బావనిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు
ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం
RELATED ARTICLES